Pace Hospitals | Best Hospitals in Hyderabad, Telangana, India

Blog Post

డీప్ వెయిన్ థ్రాంబోసిస్ - లక్షణాలు, కారణాలు, రకాలు, సమస్యలు, చికిత్స, నివారణ

Pace Hospitals
Your Webpage Title

DVT - deep vein thrombosis meaning in telugu


రక్తం గడ్డకట్టడాన్ని "థ్రాంబస్" అని పిలుస్తారు, అదేవిధంగా రక్త గడ్డలను "థ్రాంబి" అని అంటారు. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT) వల్ల శరీరంలోని ప్రధాన సిరల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చోట్ల రక్తం గడ్డలు కట్టడం జరుగుతుంది. ఇది దిగువ అవయవాలలో (కాళ్ళు లేదా తొడలలో) ఎక్కువగా కనిపిస్తుంది.


గడ్డకట్టడం వల్ల సిరల్లో రక్త ప్రవాహం అనేది పూర్తిగా లేదా పాక్షికంగా పరిమితం చేయబడుతుంది, దీని వలన కొంతమంది రోగులలో నొప్పి, వాపు, అసౌకర్యం, మరియు రంగు మారడం జరుగుతుంది. ఆ ప్రభావిత ప్రాంతంలో చర్మం అనేది ఎరుపు రంగులోకి మారడం వల్ల వెచ్చని అనుభూతి కలుగుతుంది. రక్తగడ్డ చిన్న భాగాలుగా విడిపోయి, రక్త ప్రవాహం ద్వారా ఊపిరితిత్తులకు వెళితే, అది పల్మనరీ ఎంబోలిజం (PE)కి దారితీస్తుంది.

DVT - డీప్ వెయిన్ థ్రాంబోసిస్ యొక్క ప్రాబల్యం

క్రింది కాలు సిరల్లో తరచుగా ఈ త్రాంబోసిస్ (DVT) ప్రభావితమవుతుంది. ముఖ్యంగా తొడ సిరల్లో రక్తం గడ్డ కట్టి చుట్టూరా వ్యాపించడం జరుగుతుంది. ఈ సాధారణ సిరల యొక్క త్రాంబోఎంబాలిక్ రుగ్మత 1000 మందిలో 1.6 కంటే ఎక్కువ ప్రాబల్యాన్ని చూపిస్తుంది.


శరీర మధ్యమమునకు దూరంగా అమరి యున్న సిరల్లో ఈ డీప్ వెయిన్ థ్రోమ్బోసిస్ యొక్క ప్రాబల్యం 40 శాతం ఉంటుంది. అదేవిధంగా పొప్లిటియల్ భాగంలో 16 శాతం, తొడభాగంలో 20 శాతం, ఇలియాక్ సిరల్లో 4 శాతం ప్రాబల్యాన్ని కలిగి ఉంటుంది. 10 శాతం కంటే తక్కువ DVT లు ఎగువ అవయవ సిరల్లో కనిపిస్తాయి, దీనికి ముఖ్య కారకం కేంద్ర సిరల్లో చొప్పించబడే క్యాథటర్లు.



వెనోకావల్ థ్రోమ్బోసిస్ (పెద్ద సిరల్లో రక్తం గడ్డకట్టడం) అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇది వాస్కులార్ అసాధారణతలు, సిరల కుదింపులు, మరియు క్యాన్సర్లతో సంబంధం కలిగి ఉంటుంది. 

Deep Vein Thrombosis DVT treatment in telugu | Deep Vein Thrombosis DVT in telugu

DVT - డీప్ వెయిన్ థ్రాంబోసిస్ యొక్క రకాలు 

అంతర్గత సిరల్లో రక్తం గడ్డ కట్టడం అనేది ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది:

  1. అక్యూట్ డీప్ వెయిన్ థ్రోమ్బోసిస్ (అకస్మాత్తుగా రక్తం గడ్డకట్టి కొంతకాలానికి పోతుంది)
  2. క్రానిక్ డీప్ వెయిన్ థ్రోమ్బోసిస్ (దీర్ఘకాలికంగా సిరల్లో రక్తం గడ్డ కట్టడం) 


1. అక్యూట్ డీప్ వీన్ థ్రోమ్బోసిస్: అక్యూట్ డీప్ వీన్ థ్రోమ్బోసిస్ అనేది, పురుషులు మరియు స్త్రీలలో కనిపిస్తుంది, ముఖ్యంగా ఇది కాళ్ళలో ఎక్కువగా వ్యాపిస్తుంది. తద్వారా నడిచేటప్పుడు కాళ్లలో వాపు, నొప్పి రావడం జరుగుతుంది. గాయపడిన సిరల సంఖ్య మరియు లక్షణాల తీవ్రత అనేవి రక్తపుగడ్డ యొక్క పరిమాణాన్ని బట్టి పెరుగుతాయి.


2. క్రానిక్ డీప్ వీన్ థ్రోమ్బోసిస్: ఈ క్రానిక్ డీప్ వీన్ థ్రోమ్బోసిస్ అనేది దీర్ఘకాలిక సమస్య, ఈ స్థితిలో రక్తపు గడ్డలు రెండు నెలల కంటే ఎక్కువ వయసును కలిగి ఉంటాయి. రక్తగడ్డ గట్టిపడినప్పుడు సిరలు ఎక్కువగా ప్రభావితమయి కుచించుకుపోతాయి. తద్వారా, రక్త ప్రసరణ సరిగ్గా జరగదు.



కొన్ని ఇతర రకాల డీప్ వీన్ థ్రోమ్బోసిస్ (DVT)లు ఈ క్రింది విదంగా ఉన్నాయి:

  • ప్రయాణ-అనుబంధ డీప్ వీన్ థ్రోమ్బోసిస్: సుదీర్ఘ విమానాలు, కార్లలో ఎక్కువసేపు ప్రయాణించే వ్యక్తులలో ఇది సంభవిస్తుంది.
  • ప్రసవానంతరం వచ్చే డీప్ వీన్ థ్రోమ్బోసిస్: ప్రసవించిన తరువాత మూడు నెలలలోపు మహిళల్లో ఇవి కనిపిస్తుంటాయి.
  • స్తబ్దుగా ఉండే డీప్ వీన్ థ్రోమ్బోసిస్ (ఉన్న చోటనే ఉండే ): శస్త్ర చికిత్సలు జరిగిన లేదా పెద్ద గాయాలు కలిగిన వ్యక్తులలో ఇవి సాధారణంగా వస్తుంటాయి., ఎందుకంటే వారు కదలలేరు కాబట్టి.
  • వారసత్వంగా వచ్చే డీప్ వీన్ థ్రోమ్బోసిస్: జన్యుపరమైన రుగ్మత వలన ఇది వస్తుంది, ముఖ్యంగా రక్తం గడ్డకట్టే అవకాశం ఎక్కువగా ఉన్నవారిలో ఇది సంభవిస్తుంది.

DVT - డీప్ వెయిన్ థ్రాంబోసిస్ లక్షణాలు

Deep Vein Thrombosis - DVT symptoms in telugu


డీప్ వెయిన్ థ్రాంబోసిస్ యొక్క కొన్ని లక్షణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • కాళ్లలో కొట్టినట్టు లేదా పోటు లాంటి నొప్పి కలగడం 
  • కాలులో వాపు (కొన్ని సార్లు రెండు కాళ్లలో కూడా వాపు వస్తుంది)
  • నొప్పి ప్రాంతంలో చర్మం వెచ్చగా ఉండటం 
  • ప్రభావిత ప్రాంతం చుట్టూ ఎరుపు లేదా నల్లబడిన చర్మం (నలుపు లేదా గోధుమ రంగు చర్మం ఉన్న వ్యక్తులలో ఇది కనిపించకపోవచ్చు)
  • తాకినప్పుడు బాధాకరమైన నొప్పి రావడం 


పైన పేర్కొన్న లక్షణాలతో పాటు శ్వాస ఆడకపోవడం (డిస్ప్నియా), ఛాతి నొప్పిని గనుక ఎదుర్కొంటుంటే, ఆ రోగి వెంటనే వైద్యుడిని సంప్రదించి త్వరతగితన చికిత్స తీసుకోవాలి.


పల్మనరీ ఎంబోలిజం (PE): రక్తగడ్డ చిన్న భాగాలుగా విడిపోయి, రక్త ప్రవాహం ద్వారా ఊపిరితిత్తులకు వెళితే, అది పల్మనరీ ఎంబోలిజం (PE)కి దారితీస్తుంది. గడ్డ పరిమాణం గనుక చిన్నగా ఉండి, సరైన సమయంలో చికిత్స తీసుకుంటే ఈ స్థితిని నివారించవచ్చు.


ఈ రక్తగడ్డ పెద్దదై, ఊపిరితిత్తులకు గనుక రక్తసరఫరాను అవరోధం కలిగిస్తే చివరికి మరణానికి దారితీస్తుంది. పల్మనరీ ఎంబోలిజం (PE) ఈ క్రింది వాటికి కారణం కావచ్చు:

  • శ్వాస తీసుకునేటప్పుడు ఇబ్బంది కలగటం
  • అరిథ్మియా (క్రమరహిత హృదయ స్పందనలు)
  • ఆంజినా (ఛాతీలో నొప్పి కలగడం)
  • హేమోప్టిసిస్ (దగ్గినప్పుడు రక్తం పడడం)
  • తక్కువ రక్తపోటు
  • మైకము (తల తిరగటం లేదా తేలికపాటి మూర్ఛ)


గమనిక: DVT ఉన్నవారిలో మూడింట ఒక వంతు మందిలో పోస్ట్-థ్రాంబోటిక్ సిండ్రోమ్ (PTS) అనే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య ఉత్పన్నమవుద్ది. ఈ పోస్ట్-థ్రాంబోటిక్ (PTS) సిండ్రోమ్ అనేది ఎడీమా, అసౌకర్యం, చర్మం రంగు మారడం లేదా ఎరుపు రంగుకు మరియు ఇతర సమస్యలకు దారితీస్తుంది. ఇది చర్మాన్ని సెల్యులైటిస్‌కు దారితీసేలా అనుమతిస్తుంది, ఈ ఇన్ఫెక్షన్ రక్త ప్రసరణలోకి ప్రవేశించి సెప్సిస్ మరియు మరణానికి దారితీస్తుంది.


ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ గుండెపోటు లేదా స్ట్రోక్‌కు కారణం కాదు. శరీరం అనేది గుండె ధమనుల ద్వారా ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తాన్ని తీసుకొంటుంది. ఈ గుండెపోటులు మరియు స్ట్రోక్‌లు గుండె ధమనిలో రక్తం గడ్డకట్టడం ద్వారా సంభవించవచ్చు.

DVT - డీప్ వెయిన్ థ్రాంబోసిస్ రావడానికి కారణాలు

Deep Vein Thrombosis - DVT causes in telugu


డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది క్రింద పేర్కొన్న ప్రమాద కారకాల్లో ఏదైనా ఒకదాని నుంచి సంభవించే అవకాశం ఉంది. అయినప్పటికీ, వీటికి మాత్రమే పరిమితం కాదు.

  • 60 కంటే ఎక్కువ వయస్సు ఉండటం. 
  • మంచం మీద ఎక్కువ సమయం ఉండటం లేదా ప్రయాణంలో కదలకుండా కూర్చోవడం వల్ల సంభవించవచ్చు.
  • చాలా కాలంగా సిరలకి కాథెటర్ (శరీరంలోకి సెలైన్లు పంపించే గొట్టం) కలిగి ఉండటం.
  • ఊబకాయం.
  • పాలీసైథేమియా (ఎముక మజ్జ ద్వారా చాలా రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి).
  • గత ఆరు నెలల్లో గర్భం దాల్చడం లేదా ప్రసవం అవ్వడం.
  • ఇటీవలి శస్త్రచికిత్సల తర్వాత తుంటి, పొత్తికడుపు లేదా కాళ్లలో పగుళ్లు ఏర్పడటం.

DVT - డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వ్యాధికి కారకాలు

Deep Vein Thrombosis - DVT risk factors in telugu


డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వ్యాధికి ప్రమాద కారకాలు ఈ క్రింది విదంగా ఉన్నాయి:

  • సాధారణ ప్రమాద కారకాలు
  • గడ్డకట్టడానికి సంబంధించిన ప్రమాద కారకాలు
  • సహజమైన ప్రమాద కారకాలు
  • సంభావ్య ప్రమాద కారకాలు 


సాధారణ ప్రమాద కారకాలు

  • ఆపరేషన్లు, అనస్థీషియా, అదేవిధంగా ఎక్కువ రోజులు బెడ్ రెస్ట్‌లు తీసుకోవడం, ఫ్లైట్‌లలో దూర ప్రయాణాలు తరుచుగా చేయడం వంటి కదలిక లేని పరిస్థితుల వల్ల రక్త ప్రసరణ తగ్గి DVT రావచ్చు.
  • స్టెనోసిస్ (మార్గసంకోచం), పుట్టుకతో పిండంలో వచ్చే అసాధారణ మార్పులు, లేదా నియోప్లాజమ్ (కణజాలం యొక్క అసాధారణ పెరుగుదల) లేదా గర్భం కారణంగా సిరల్లో రక్తపోటు పెరిగి DVT రావచ్చు.
  • పరిధీయ సిరల్లో కాథెటర్స్ చొప్పించడం, ట్రామా (గాయం), సర్జరీ, మునుపటి DVT వ్యాధి లేదా సిరల ద్వారా డ్రగ్స్ని చొప్పించడం వల్ల సిరకు గాయం జరిగి DVT రావచ్చు.
  • పాలీసైథేమియా రుబ్రా వెరా (ఎముక మజ్జ అధిక రక్త కణాలను ఉత్పత్తి చేయడం), థ్రోంబోసైటోసిస్ (శరీరం ద్వారా చాలా ప్లేట్‌లెట్‌లను ఉత్పత్తి చేయడం) లేదా డీహైడ్రేషన్ కారణంగా పెరిగిన రక్త స్నిగ్ధత వల్ల DVT రావచ్చు.
  • సిరలలో మార్పులు ద్వారా థ్రాంబోసిస్‌ రావచ్చు.


గడ్డకట్టడానికి సంబంధించిన ప్రమాద కారకాలు

  • C మరియు S యాంటీకోగ్యులేషన్ ప్రోటీన్లు (గడ్డకట్టడానికి బాధ్యత వహించే గ్లైకోప్రొటీన్లు), యాంటిథ్రాంబిన్ III (గడ్డకట్టే కారకం) లేదా ఫ్యాక్టర్ V లీడెన్ మ్యుటేషన్ (గడ్డకట్టే కారకం) మొదలైన జన్యుపరమైన లోపాల వల్ల డీప్ వీన్ థ్రాంబోసిస్‌ రావచ్చు.
  • వాస్కులైటిస్ (రక్తనాళాల వాపు), సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసస్ (ఆటోఇమ్యూన్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్), ఆల్టర్డ్ లూపస్ యాంటీకోగ్యులెంట్ (ఇమ్యునోగ్లోబులిన్‌లు), ఇన్‌ఫ్లమేటరీ పేగు వ్యాధి (జీర్ణ వాహిక వాపు), నెఫ్రోటిక్ సిండ్రోమ్ (మూత్రపిండాల ద్వారా ప్రొటీన్లు ఎక్కువగా విసర్జించబడటం) వల్ల కలిగే నష్టాలు , సెప్సిస్ (ప్రాణాంతక ఇన్ఫెక్షన్), మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (గుండెపోటు), గుండె వైఫల్యం, రక్తపోటు, మధుమేహం, కాలిన గాయాలు, నోటి ద్వారా హార్మోన్ల మందులు తీసుకోవడం, ధూమపానం మొదలైనవి డీప్ వెయిన్ థ్రాంబోసిస్‌ను కలిగించవచ్చు. 


సహజమైన ప్రమాద కారకాలు: శస్త్రచికిత్స, క్రిటికల్ కేర్ అడ్మిషన్, డీహైడ్రేషన్ (నిర్జలీకరణం), క్యాన్సర్, ఊబకాయం, గర్భం, వయోభారం మొదలైనవి.


సంభావ్య ప్రమాద కారకాలు: సాధారణ మత్తుమందులతో శస్త్రచికిత్స, హాస్పిటలైజేషన్ (చాల రోజులు హాస్పిటల్లో ఉండి చికిత్స తీసుకోవడం ), సిజేరియన్ విభాగం (కోత ద్వారా శిశువు జనన ప్రక్రియ), హార్మోన్ పునఃస్థాపన చికిత్స, గర్భం మరియు పెరిపార్టమ్ పీరియడ్ (పుట్టిన కొద్దిసేపటి ముందు లేదా ఆ సమయంలో, లేదా వెంటనే), దిగువ అంత్య భాగాలకు గాయం మొదలైనవి.

DVT - డీప్ వెయిన్ థ్రాంబోసిస్ యొక్క సమస్యలు

Deep Vein Thrombosis - DVT complications in telugu


అంతర్గత సిరల్లో రక్తం గడ్డ కట్టడం వల్ల వచ్చే సమస్యలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • ప్రతిస్కంధకాలను (యాంటి-కొగ్యులెంట్ మందులను) ఉపయోగించడం వల్ల రక్తస్రావం అవడం.
  • పల్మనరీ ఎంబోలిజం (ఊపిరితిత్తుల ధమనులు నిరోధించబడటం).
  • పోస్ట్-థ్రోంబోటిక్ సిండ్రోమ్ మొదలైనవి.

DVT - డీప్ వెయిన్ థ్రాంబోసిస్ యొక్క దశలు

కింది వర్గాలు వ్యాధి యొక్క తీవ్రతను వివరిస్తాయి:

  • ప్రేరేపించేవి: పొందిన పరిస్థితుల ఫలితంగా (క్యాన్సర్, నోటి గర్భనిరోధకాలు, గాయం, నిశ్చలత మరియు ఊబకాయం వంటివి)
  • ప్రేరేపించబడనివి: ఎండోజెనస్ లేదా ఇడియోపతిక్ (తెలియని) కారణాల వల్ల, ప్రతిస్కందకం ఆగిపోయినట్లయితే పునరావృతమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
  • ప్రాక్సిమల్: మోకాలిపై ఫెమోరల్ సిరలను ప్రభావితం చేస్తుంది; తద్వారా పల్మనరీ ఎంబోలి వంటి పరిణామాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
  • డిస్టల్: మోకాలి క్రింద ఫెమోరల్ సిరలను ప్రభావితం చేస్తుంది.

DVT - డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వ్యాధి యొక్క రోగ నిరూపణ

దాదాపుగా అన్ని DVTలు ఎటువంటి సమస్యలను కలుగజేయకుండా తగ్గిపోతాయి. కానీ, కొన్ని అరుదు సందర్భాలలో ఈ క్రిందివి ఉత్పన్నమౌతాయి:

  • DVT వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత, 43% మంది రోగులలో పోస్ట్-థ్రాంబోటిక్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంది. (తేలికపాటి తీవ్రత: 30%; మితమైన తీవ్రత: 10%; తీవ్రమైన: 3%).
  • DVT పునరావృతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది (దాదాపు 25% వరకు).
  • దాదాపు 6% DVT కేసులు మరియు 12% పల్మనరీ ఎంబోలిజం (PE) కేసులు రోగనిర్ధారణ జరిగిన ఒక నెలలోనే మరణంతో ముగుస్తాయి.
  • సిరల థ్రోంబోఎంబోలిజం వల్ల వచ్చే అకాల మరణం అనేది ముఖ్యంగా వయస్సు, అంతర్లీన హృదయ సంబంధ వ్యాధులు మరియు పల్మోనరీ ఎంబోలిజంలతో సంబంధం కలిగి ఉంటుంది.

అపాయింట్‌మెంట్ కోసం

DVT - డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వ్యాధి యొక్క రోగ నిర్ధారణ 

Deep Vein Thrombosis - DVT diagnosis in telugu


అంతర్గత సిరల్లో రక్తం గడ్డ కట్టి రోగి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ వారు సాధారణంగా రోగి యొక్క చరిత్రను మరియు లక్షణాలను అడిగి తెలుసుకుంటారు. ఆ పిమ్మట 24 గంటలలోపు అల్ట్రాసౌండ్ పరీక్షను సూచిస్తారు.


వైద్యులు బహుశా DVT వ్యాధికి కారణమయ్యే లక్షణాలు వ్యక్తిలో ఏమున్నాయో తెలుసుకోవడానికి భౌతిక పరీక్ష చేస్తారు.


శారీరక పరిక్ష

  • రక్తపు గడ్డ గనుక పెల్విక్ సిరల్లోకి జరిగితే, కాళ్లలో ఎడీమాను (శరీరంలో నీరు లేదా ద్రవం చేరుట) గమనించవచ్చు.
  • సిరల దగ్గర ఎరుపు లేదా వేడితో కూడిన చర్మం ఉండటం. 
  • సున్నితత్వం (తాకితే నొప్పి రావడం).


వ్యక్తి యొక్క ఆరోగ్య చరిత్రను తెలుసుకోవడం 

  • నొప్పి (సాధారణంగా 50% మంది రోగులలో కనిపిస్తుంది)
  • ఎరుపు రంగు
  • వాపు (సాధారణంగా 70% మంది రోగులలో కనిపిస్తుంది)


రోగనిర్ధారణకు గల వాస్కులర్ పరీక్షలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • డాప్లర్ అల్ట్రాసౌండ్ పరీక్ష
  • పెల్విక్ MRI (మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ స్కాన్)
  • పూర్తి రక్త గణన (CBC)
  • డి-డైమర్ రక్త పరీక్ష (డీప్ వెయిన్ థ్రాంబోసిస్ టెస్ట్)
  • జన్యు పరీక్ష
  • ప్రోటీన్ C మరియు ప్రోటీన్ S స్థాయిలు
  • యాంటిథ్రాంబిన్ III స్థాయిలు
  • లూపస్ సంబంధిత పరీక్షలు మొదలైనవి

DVT - డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వ్యాధికి చికిత్స

Deep Vein Thrombosis - DVT treatment in telugu


DVT (డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వ్యాధి) చికిత్సకి ఈ క్రింది చికిత్సా పద్ధతులు మొదటి వరుసలో ఉంటాయి:

  • రక్తం పలచబడటానికి మందులు
  • రక్తం గడ్డ కట్టకుండా ఉండటానికి నోటి ద్వారా యాంటి-కొగ్యులెంట్ మందులు ఇవ్వడం 
  • Ⅹa కొగ్యులెంట్ ఫ్యాక్టర్ నిరోధకాలు 


కొన్ని అరుదైన సందర్భాల్లో, వైద్యుడు/ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, పైన పేర్కొన్న విధానాలతో పాటు శస్త్రచికిత్సలను కూడా సూచిస్తారు. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వ్యాధికి ఉపయోగించే శస్త్రచికిత్సా విధానాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • ఎండోవాస్కులర్ విధానాలు
  • స్టెంటింగ్
  • ప్రధాన సిరలో ఫిల్టరుని అమర్చడం 

DVT - డీప్ వెయిన్ థ్రాంబోసిస్ నివారణ మరియు జీవనశైలి మార్పులు

డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT) నివారణ ఈ కింది చర్యలను కలిగి ఉంటుంది, అవి ఏమనగా:

  • ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండడం.
  • సాధారణ నడకలు; రోజువారీ నడకలు DVT రాకుండా ఉండటానికి సహాయపడతాయి. 
  • డీహైడ్రేట్ (నిర్జలీకరణ) అయినట్లయితే DVT వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది, అందువల్ల తరుచుగా నీళ్లు మరియు జ్యూస్లు త్రాగడం మంచిది.
  • పగటిపూట ఎక్కువసేపు కదలకుండా ఉండటం మానుకోవాలి; కనీసం ప్రతి గంటకి ఒకసారి లేచి నడవాలి. 
  • కూర్చున్నప్పుడు కాలి మీద కాళ్ళు వేసి కూర్చోవడం మానుకోవాలి.
  • ధూమపానాన్ని నివారించాలి. 
  • మద్యానికి దూరంగా ఉండాలి.


డీప్ వెయిన్ థ్రాంబోసిస్కి చికిత్స జరిగిన తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు:

  • కూర్చున్నప్పుడు, శస్త్రచికిత్స జరిగిన కాలును పైకి ఉంచండి.
  • బ్లడ్ థిన్నర్ మందులు తీసుకోవడం ప్రారంభించిన తర్వాత కనీసం రెండు వారాల పాటు ఏదైనా దూర ప్రయాణాలు చేయడం మానుకోవాలి.
  • తప్పనిసరిగా మంచం మీద ఎక్కువసేపు ఉండవలసి వస్తే, వ్యక్తి యొక్క ఆరోగ్య సంరక్షకులు రోగి యొక్క చీలమండలు మరియు కాలి వేళ్లను పైకి, క్రిందికి తిప్పాలని సూచించడం జరుగుతుంది, తద్వారా రక్త ప్రసరణ స్వేచ్ఛగా జరుగుతుంది.
  • సాగే తత్వం ఉన్న లేదా కుదింపు సాక్స్ (DVT సాక్స్) ఉపయోగించడం వల్ల రోగికి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
  • తదుపరి సమస్యలను నివారించడానికి డాక్టర్ సూచించిన మందులను కొన్ని రోజులపాటు కొనసాగించాలి.
  • అత్యవసర పరిస్థితుల్లో, వెంటనే వైద్య సంరక్షణను కోరాలి.
  • క్రమపద్ధతిలో వైద్యుల అప్పోయింట్మెంట్లను తీసుకుని తగినంత చికిత్సను పొందాలి.

DVT మరియు వెరికోస్ సిరల మధ్య వ్యత్యాసం

Deep vein thrombosis vs varicose veins in telugu


డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT) మరియు అనారోగ్య సిరలు శరీరంలోని సిరలను ప్రభావితం చేసే రెండు విభిన్న వాస్కులర్ పరిస్థితులు, కానీ వాటికి వివిధ కారణాలు, లక్షణాలు మరియు సంభావ్య సమస్యలు ఉన్నాయి.

అంశాలు వెరికోస్ సిరలు DVT (డీప్ వెయిన్ థ్రాంబోసిస్)
అవలోకనం ఈ అనారోగ్య పరిస్థితిలో, శరీరంలోని సిరలు పెద్దవిగా అయ్యి, వక్రీకృతమవుతాయి. ఈ సమస్య కాళ్ళలో చాలా సాధారణం. DVT అనేది సిరలలో రక్తం గడ్డ కట్టడం ద్వారా వస్తుంది, ఇది ఎక్కువగా దిగువ అవయవాల సిరలలో కనబడుతుంది.
కారణాలు ఇది సిరల్లో రక్తపోటు పెరగడం, గాయం లేదా సిరలు దెబ్బతినడం, ఎక్కువసేపు కదలని స్థితిలో ఉండటం ద్వారా వస్తుంది. ప్రధాన సిరలకు గాయం లేదా వాపు, ఇన్ఫెక్షన్ మొదలైనటువంటి కారణాల వల్ల వస్తుంది
వ్యాధికి కారకాలు కాలుకి గాయం అవ్వడం, గర్భం, ధూమపానం, గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం, హార్మోన్ పునఃస్థాపన చికిత్స, అధిక బరువు, వృద్ధాప్యం, లింగం: స్త్రీలలో ఎక్కువగా వస్తుంది, క్రియారహితంగా ఉండటం. గాయం, ఊబకాయం, 60 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు, ఎక్కువసేపు కదలని స్థితిలో ఉండటం, గర్భం, డీహైడ్రేషన్ (నిర్జలీకరణ), హార్మోన్ పునఃస్థాపన చికిత్సలు, సిరల్లో కాథెటర్‌లను చొప్పించడం.
లక్షణాలు చర్మంలో రంగు మార్పులు, కాళ్లపై పుండ్లు మరియు దద్దుర్లు, బరువుగా అనిపించడం, కాళ్లలో మంట. కాళ్ళలో నొప్పి, ఒకటి లేదా రెండు కాళ్ళలో వాపు, వాపుతో కూడిన సిరలు, సోకిన ప్రాంతం చుట్టూ ఎరుపు లేదా నల్లబడిన చర్మం, నొప్పి ప్రాంతంలో వెచ్చని చర్మం.
సమస్యలు ఫ్లేబిటిస్ (సిరల వాపు), రక్తం గడ్డకట్టడం పల్మనరీ ఎంబోలిజం, పోస్ట్-థ్రాంబోటిక్ సిండ్రోమ్, రక్తస్రావం
వ్యాధి నిర్ధారణ డ్యూప్లెక్స్ అల్ట్రాసౌండ్ పూర్తి రక్త గణన (CBC), D-డైమర్ రక్త పరీక్ష, డాప్లర్ అల్ట్రాసౌండ్ పరీక్ష, పెల్విక్ MRI, యాంటిథ్రాంబిన్ III స్థాయిలు, లూపస్-సంబంధిత సమస్యలు, జన్యు పరీక్ష, ప్రోటీన్ C మరియు ప్రోటీన్ S స్థాయిలు
చికిత్స కంప్రెషన్ సాక్సులను ధరించడం, స్క్లెరోథెరపీ, థర్మల్ అబ్లేషన్, మైక్రోఫ్లెబెక్టమీ ఎండోవాస్కులర్ విధానాలు, స్టెంటింగ్, వెనా కావా ఫిల్టర్ ప్లేస్‌మెంట్, థ్రోంబోలిటిక్ ఏజెంట్లు మరియు రక్తాన్ని పలుచన చేసే మందులు, యాంటి-కొగ్యులెంట్ మందులు, Ⅹa నిరోధకాలు

అపాయింట్‌మెంట్ కోసం

DVTలో తరచుగా అడిగే ప్రశ్నలు


  • డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT)ని ఎలా నివారించాలి?

    సాగే లేదా కుదింపు సాక్సులు (DVT సాక్సులు) ఉపయోగించడం ద్వారా DVT ని నిరోధించవచ్చు, ఇది సిరలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది; నడక కూడా సిరలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

    ఇవి కాకుండా, వైద్య సిబ్బంది సూచించిన వ్యాయామాలు చేయడం, ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండడం, హైడ్రేట్‌గా (నిర్జలీకరణను అరికట్టడం) ఉండటం, చలనం లేని భంగిమలను నివారించడం వంటి అనేక అంశాలు DVTని నివారించడంలో ప్రధాన పాత్రను పోషిస్తాయి.

  • డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT) ఎంత తీవ్రమైనది?

    అంతర్గత సిరల్లో రక్తం గడ్డ కట్టడం (DVT) అనేది ఒకోసారి ప్రాణాపాయ స్థితికి కూడా దారితీస్తుంది. శరీరంలోని సిరలో, సాధారణంగా కాళ్ళ యొక్క సిరల్లో రక్తం గడ్డకట్టడం ఏర్పడినప్పుడు ఇది సంభవిస్తుంది. రక్తపు గడ్డ విడిపోయి కొన్ని సందర్భాల్లో ఆ భాగాలు ఊపిరితిత్తులకు చేరుకుంటాయి, తద్వారా పల్మనరీ ఎంబోలిజం (PE)కి దారితీస్తుంది. PE అనేది ఊపిరితిత్తులలోని ధమనిలో అవరోధం కలగడం వల్ల కొన్ని సార్లు శ్వాస ఆడకపోవటం, ఛాతీ నొప్పి మరియు మరణానికి దోహాదపడుతుంది.


    DVT యొక్క తీవ్రత రక్తం గడ్డ యొక్క పరిమాణం, గడ్డకట్టే ప్రదేశం మరియు గడ్డ భాగాలుగా విడిపోయి ఊపిరితిత్తులకు చేరిందా లేదా అనే విషయాలతో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. విరిగిపోని చిన్న గడ్డలు ఎటువంటి లక్షణాలను కలిగించకపోవచ్చు మరియు లక్షణాలు వాటి అంతట అవే తగ్గుతాయి.


     అయినప్పటికీ, ఊపిరితిత్తులకు వెళ్లే పెద్ద గడ్డలు చాలా తీవ్రమైనవి మరియు ప్రాణాంతకం కూడా. మీరు DVTని కలిగి ఉండవచ్చని అనుకుంటే, వెంటనే వైద్యుడి దగరికి వెల్లడం చాలా ముఖ్యం. DVTని బ్లడ్ థిన్నర్స్‌తో చికిత్స చేయవచ్చు, ఇది గడ్డకట్టడం పెద్దదిగా లేదా విరిగిపోకుండా ఉండేలా చేసి సహాయపడుతుంది. ప్రారంభ దశలో రోగ నిర్ధారణ మరియు చికిత్స అనేది PE వంటి సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది.

  • డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT) దానంతటికి అదే నయమవుతుందా?

    డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT) చాలా సందర్భాలలో లక్షణాలను బహిర్గతం కాకుండానే నయం అవుతుంది. సాధారణంగా, కండరాల మీద గుండా వెళ్ళే పెద్ద, లోతైన సిరలలో రక్తం గడ్డకట్టి క్రింది కాలి సిరల్లో థ్రాంబోసిస్ వచ్చేలా చేస్తుంది.

    చాలా సందర్భాలలో, చికిత్స చేయకుండానే దానంతట అదే నయం అవుతుంది.


    అయినప్పటికీ, ఇది కొన్నిసార్లు అసౌకర్యం మరియు ఎడీమా వంటి సంకేతాలకు దారితీయవచ్చు. పైన పేర్కొన్న లక్షణాలతో DVTని గనుక  గుర్తించినట్లయితే, పల్మనరీ ఎంబోలిజం వంటి తీవ్రమైన సమస్యలను నివారించడానికి ప్రాధమికంగా చికిత్స అవసరం.

  • డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT)కి శాశ్వత నివారణ ఉందా?

    DVTకి శాశ్వత నివారణ ఉందని ఎటువంటి అధ్యయనాలు ఇప్పటివరకు నిరూపించలేదు. చాలా పరిస్థితులలో, చిన్నపాటి గడ్డలు లక్షణాలను చూపించకుండానే స్వయంగా నయమవుతాయి, అదేవిధంగా వాపు వంటి లక్షణాలను గుర్తించినప్పుడల్లా చికిత్స సూచించబడుతుంది.


    సాధారణంగా, ఎండోవాస్కులర్ ప్రక్రియలు, స్టెంటింగ్ మరియు బ్లడ్ థిన్నర్స్ వాడకం వంటివి DVT పరిస్థితులను పరిష్కరించడానికి సూచించబడతాయి. అయితే శస్త్రచికిత్స తర్వాత అనారోగ్య జీవనశైలి అలవాట్లు, ఊబకాయం మరియు ఎక్కువ సేపు కదలకుండా ఉండటం వల్ల DVT మళ్లీ పునరావృతం అయ్యే అవకాశం ఉంది.

  • డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT) వ్యాధి వంశపారంపర్యంగా వస్తుందా?

    అవును, ఇది యాంటి-కొగ్యులెంట్ (ప్రతిస్కందక) ప్రోటీన్లు C మరియు S, యాంటిథ్రాంబిన్ III లోపం మరియు ఫాక్టర్ V లైడెన్ మ్యుటేషన్ వంటి జన్యుపరమైన లోపాల వల్ల సంభవించవచ్చు.


  • డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT) యొక్క ప్రమాద సంకేతాలు ఏమిటి?

    DVT యొక్క హెచ్చరిక సంకేతాలు ఏమనగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, హేమోప్టిసిస్ (రక్తంతో కూడిన దగ్గు), తక్కువ రక్తపోటు, మైకము (తేలికపాటి తలనొప్పి లేదా మూర్ఛ), అరిథ్మియా (క్రమరహిత హృదయ స్పందనలు) మరియు యాంజైనా (దీర్ఘంగా శ్వాస తీసుకున్నప్పుడు ఛాతిలో నొప్పి). ఒకవేళ రోగులు పైన పేర్కొన్న లక్షణాలను గనుక అనుభవిస్తే, అలాంటప్పుడు పల్మనరీ ఎంబోలిజం (రక్తం ఊపిరితిత్తులకు చేరకుండా అడ్డుకోవడం) వంటి సమస్యలను నివారించడానికి అత్యవసర వైద్య సంరక్షణను తప్పనిసరిగా తీసుకోవాలి.


  • డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT)కి మీరు ఎలా చికిత్స చేస్తారు?

    డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT)కి మొదటి చికిత్స ఎంపిక యాంటి-కొగ్యులెంట్ మందులు (రక్తాన్ని పల్చగా చేసేవి). ఇవి గడ్డకట్టడాన్ని నిరోధించి ఊపిరితిత్తులకు రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి. అయినప్పటికీ, పరిస్థితి యొక్క తీవ్రత ఆధారంగా కొన్ని శస్త్రచికిత్సా విధానాలు సిఫార్సు చేయబడతాయి. DVT కోసం శస్త్రచికిత్సలు, ఇన్వాసివ్ విధానాలు ఎండోవాస్కులర్ విధానాలు, స్టెంటింగ్ మరియు వీనా కావా ఫిల్టర్ ప్లేస్‌మెంట్ వంటివి ఉన్నాయి.


  • డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT) వ్యాధితో ఏ వ్యాధి పొరపడతాము?

    DVTతో సారూప్యమైన పోలికలు ఉన్న పరిస్థితులు ఏమనగా సెల్లులైటిస్, పోస్ట్-థ్రాంబోటిక్ సిండ్రోమ్, సిర లేదా శోషరస అవరోధం, ధమనుల ఫిస్టులా, పుట్టుకతో వచ్చే వాస్కులర్ అసాధారణతలు, వాస్కులైటిస్, రప్చర్ బేకర్ సిస్ట్, సిరికి దెబ్బ తగలడం, సూపెర్ఫిషల్ త్రొమ్బోఫ్లేబిటిస్, పెరిఫెరల్ ఎడీమా, గుండె వైఫల్యం, సిర్రోసిస్, నెఫ్రోటిక్ సిండ్రోమ్ మొదలైనవి.


  • తరుచుగా విమానాల్లో ప్రయాణం చేసేవారు డీప్ వెయిన్ థ్రాంబోసిస్‌ రాకుండా ఎలా నివారించాలి?

    ముఖ్యంగా ఈ సమస్య విమానం క్యాబిన్‌ల పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని సార్లు తక్కువ స్థలం ఉండటం వల్ల క్యాబిన్లో కుచించి కూర్చోవాల్సి వస్తుంది, అది రకప్రసరణను సరిగ్గా జరగనివ్వదు. తద్వారా, DVT అభివృద్ధి చెందుతుంది. అందువల్ల విమానాల్లో చలనశీలత కోసం కొన్ని వ్యాయామాలు చేయమని కరపత్రాల్లో ప్రచురించి  ప్రదర్శింపబడతాయి. ఒకవేళ సుదీర్ఘ ప్రయాణాలు చేయవలసి వచ్చి విమానంలో కొద్దిపాటి స్థలం మాత్రమే ఉంటే గనుక కాళ్ళ దగ్గర లగేజీ లేకుండా పైన ఓవర్ హెడ్ బిన్లో పెట్టుకుని, కాళ్ళు సాఫీగా చాపుకుని కూర్చోవాలి, తద్వారా రక్తప్రసరణ సరిగ్గా జరిగి DVT ని రాకుండా నివారించవచ్చు.


  • డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT)కి ఎవరు చికిత్స చేస్తారు?

    ముందుగా జనరల్ ఫీజిష్యన్ లక్షణాలను తెలుసుకుని DVTకి చికిత్స మరియు మందులను సూచించడం జరుగుతుంది, అయితే శస్త్రచికిత్సలు అనేవి వాస్కులర్ సర్జన్ లేదా వాస్కులర్ స్పెషలిస్ట్ (ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్) చేత చేయబడతాయి.



Share on

Request an appointment

Fill in the appointment form or call us instantly to book a confirmed appointment with our super specialist at 04048486868

Appointment request - health articles

Case study of a 78-Y/O male with coronary & peripheral artery disease treated at PACE Hospitals, Hyd
By Pace Hospitals April 14, 2025
Explore the case study of a 78-year-old male with coronary and peripheral artery disease, treated by the Cardiology team with CAG, PAG & POBA at PACE Hospitals, Hyderabad
 Dr. Kantamneni Lakshmi from PACE Hospitals explains hair transplant types, benefits & side effects
By Pace Hospitals April 14, 2025
Thinking about hair Transplant? Dr. Kantamneni Lakshmi from PACE Hospitals explains hair transplant types, benefits, Treatment, side effects & Success Rate in this informative video.
Healthy lifestyle habits for bone health including calcium-rich foods, sunlight for vitamin D
By Pace Hospitals April 12, 2025
Discover simple and effective ways to maintain strong, healthy bones through proper nutrition, regular exercise, and lifestyle changes. Learn how to prevent bone loss and improve bone density at every stage of life.
Diabetic foot symptoms & causes | Diabetic foot treatment in India | What is Diabetic foot
By Pace Hospitals April 12, 2025
Diabetic foot is caused by nerve damage and poor circulation, often leading to ulcers and infections. Learn about its types, symptoms, causes, complications, treatment options, and preventive care.
Complex AV fistula for dialysis treatment in Hyderabad | Fistuloplasty procedure in Hyderabad, India
By Pace Hospitals April 12, 2025
A 64-year-old patient with a complex AV fistula complication was successfully treated at PACE Hospitals, Hyderabad, using fistuloplasty—restoring effective dialysis access and improving vascular function.
Case study of a 43-year-old male successfully underwent DJ stent removal at PACE Hospitals
By Pace Hospitals April 11, 2025
Case study of a 43-year-old male patient highlighting successful DJ stent removal at PACE Hospitals following URSL for complete clearance of a right ureteric calculus.
World Parkinson's Day 11 April | World Parkinson's Disease Day 2025 | World PD Day Theme, Importance
By Pace Hospitals April 11, 2025
World Parkinson’s Day, observed annually on April 11, raises global awareness about the economic, social, and cultural impact of Parkinson’s disease. The day advocates for patient acceptance, support, and inclusion.
World Hemophilia Day 17 April 2025 | Theme of World Hemophilia day 2024
By Pace Hospitals April 10, 2025
World Haemophilia Day is a global healthcare event celebrated on the 17th of April every year, started by the World Federation of Haemophilia (WHF) with the intention to raise a call for a better treatment, care and prevention with haemophilia.
PACE Hospitals podcast featuring Dr. Kantamneni Lakshmi explaining rhinoplasty surgery
By Pace Hospitals April 10, 2025
Tune into the PACE Hospitals podcast featuring Dr. Kantamneni Lakshmi as she dives deep into rhinoplasty surgery—its purpose, procedure, types, benefits, Side effects & expected results.
Show More

Share by: